75 ఏండ్లుగా మోసపోతున్న బీసీలు..రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి

75 ఏండ్లుగా  మోసపోతున్న బీసీలు..రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి

ముషీరాబాద్, వెలుగు: దేశంలో 75 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. నల్లకుంటలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల స్థితిగతులపై అనేక కమిషన్లు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చినా.. బీసీ జాతిని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధించేవరకు బీసీలు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ సిద్ధిరాములు, తలారి ప్రవీణ్, సాయి కృష్ణ, సబ్బని లత, ఆంజనేయులు పాల్గొన్నారు.