అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి : కొండా సురేఖ

అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి : కొండా సురేఖ
  •      అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు : తెలంగాణలోని అడవుల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆమె ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. ఇటీవల అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరిగినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. 

ఈ ప్రమాదాల వల్ల వన్య ప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు నష్టం జరిగిందని చెప్పారు. అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వీలైనంత త్వరగా అడవుల్లో జరిగే అగ్నిప్రమాదాలను నివారించే మార్గాలను అన్వేషించాలని మంత్రి కోరారు.