ఫిబ్రవరి ఒకటి నుంచి ఎండలు మొదలు అంట.. బీ కేర్ ఫుల్

ఫిబ్రవరి ఒకటి నుంచి ఎండలు మొదలు అంట.. బీ కేర్ ఫుల్

జనవరి నెల అయిపోవస్తోంది. వింటర్ కూడా అయిపోవస్తోంది.ఈ సీజన్ లో కాస్త చలి ఎక్కువగానే అనిపించింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. జనవరిలో మిగిలిన ఉన్న చివరి వారంలో కూడా ఉత్తర తెలంగాణలో ఇంకా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందట.. మిగతా తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పడిపోతాయట. జనవరి 24 నుంచి 30 వరకు చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. ఈ వారం రోజులు శీతాకాలానికి వీడ్కోలు చెపుతూ వింటర్ ను ఎంజాయ్ చేయండి అంటున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి రాబోయే రోజుల్లో ఎండలు మండి పోతాయని వాతావరణ నిపుణులు చెపుతున్నారు.  

ఫిబ్రవరి 1 నుంచి ఎండలు మొదలవుతాయని.. ప్రారంభం నుంచే దాదాపు 34-35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఫిబ్రవరిలోనే సమ్మర్ మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎండలు ఎక్కువయితే  తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సో బీకేర్ ఫుల్..