హ్యాపీ హైపాక్సియాతో జర భద్రం

హ్యాపీ హైపాక్సియాతో జర భద్రం

కొవిడ్​ ఒక్కొక్కరి మీద ఒక్కో రకంగా ప్రభావం చూపిస్తోంది. కొందరికి లక్షణాలు ముందే తెలుస్తున్నాయి. కాబట్టి టెస్ట్​ చేయించుకుని, సమస్యలకు తగిన ట్రీట్​మెంట్ తీసుకోవచ్చు. కానీ, మరికొందరిలో ముందుగా ఏ లక్షణాలూ ఉండటం లేదు. ఒక్కసారిగా ప్రాణం మీదకు వస్తే తప్ప కొవిడ్ బారినపడ్డట్టు తెలియడంలేదు. అలాంటి వాటిలో ‘హ్యాపీ హైపాక్సియా’ ఒకటి. ఇది సాధారణ హైపోక్సియా లాంటిదే. కానీ, ఏ లక్షణాలు లేకుండా ఒక్కసారిగా రావడంతోనే ప్రాణాల మీదకు వస్తోంది. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించడంతో పాటు, కరోనా సోకకుండా చూసుకోవడం, కొవిడ్​ పట్ల జాగ్రత్తగా ఉండటమే మన ముందు ఉన్న అవకాశం అని డాక్టర్​ నిఖిల్​ మాథుర్​ చెబుతున్నారు. డ్​ ఆక్సిజన్​ లెవెల్స్​ సాధారణంగా ఉండే స్థాయి కంటే తక్కువగా ఉండటాన్ని ‘హైపాక్సియా’  అంటారు. కరోనా సోకినవాళ్లలో ఏ అనారోగ్య సమస్య బయటపడకుండానే ఒక్కసారిగా ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ 95 కంటే తక్కువకు పడిపోతుంది. దాంతో మనిషి కుప్పకూలిపోతాడు. అప్పటి దాకా మామూలుగా పనులన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్లలో ఏ లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని ‘హ్యాపీ లేదా సైలెంట్​ హైపాక్సియా’ అంటున్నారు. 

సాధారణ హైపాక్సియాతో ఇబ్బందిపడేవాళ్లలో ఏ సమస్యలు ఉంటాయో, హ్యాపీ హైపాక్సియా సమస్య ఉన్నవాళ్లలోనూ అవే సమస్యలు ఉంటాయి. హైపాక్సియా సమస్య వల్ల మెదడు, గుండె, కిడ్నీలకు ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ కావాల్సినంత అందదు. వాటి పనితీరు మందగిస్తుంది. కాళ్లు, చేతులు వణుకుతాయి. చెమట పడుతుంది. కళ్లు తిరుగుతాయి. విపరీతమైన ఆయాసం, నిస్సత్తువగా లేవలేని స్థితిలో ఉంటారు. కొవిడ్​ మహమ్మారి ప్రబలిన ఈ టైం​లో వీటిలో ఏ సమస్య వచ్చినా దానిని కొవిడ్​గా అనుమానించాల్సిందే. వెంటనే ఆక్సీమీటర్​తో ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ 95 కంటే ఎక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నదా? చెక్​ చేసుకోవాలి. తక్కువగా ఉంటే  వెంటనే హాస్పిటల్​కి వెళ్లాలి. హాస్సిటల్​లో బెడ్​ దొరక్కపోతే ఇంట్లోనే ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్​ తీసుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్​ లేదా ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ కాన్సన్​ట్రేటర్స్​ కూడా దొరక్కపోతే ప్రోన్​ పొజిషన్​లో ఊపిరి తీసుకోవాలి. 

అలర్ట్‌‌గా ఉండాలి.. 

పల్స్ ఆక్సీమీటర్​లో ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సాచురేషన్​ లెవల్స్​ 95 లేదా 94 కంటే తక్కువ ఉంటే అలర్ట్ కావాలి. బ్లడ్​ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ 94 లేదా 95 కంటే తక్కువకు తగ్గిపోతే కంగారుపడాల్సిన అవసరం లేదు.  సీఓపీడీ, ఆస్తమా, లంగ్ ​ప్రాబ్లమ్  ఉన్నవాళ్లలో బ్లడ్ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సాధారణంగానే తక్కువగా (90 – 92 మధ్య) ఉంటుంది. కాబట్టి వాళ్లు కంగారు పడకూడదు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు 90 నుంచి 92 కంటే తక్కువకు పడిపోతే అప్పుడు అలర్ట్ కావాలి. 

నాలుగు గంటలకు ఒకసారి

కరోనా వైరస్​ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల లంగ్స్​లో ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ మొదలవుతుంది. కండరాలన్నీ పాడైపోతే ఆక్సిజన్​ని గ్రహించలేవు. కరోనా వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య కూడా ఉంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఊపిరితిత్తులకు తగినంత రక్తం సరఫరా కాకపోతే రక్తంలోకి ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ చేరదు. అందువల్ల ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ తగ్గుతుంది. కాబట్టి కొవిడ్​ పాజిటివ్​ వస్తే.. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ని చెక్​ చేసుకుంటూ ఉంటే హ్యాపీ హైపాక్సియా నుంచి ఎవరిని వాళ్లు కాపాడుకోవచ్చు. ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ ఇస్తూ, స్టిరాయిడ్స్ ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. 

ప్రోన్‌‌‌‌‌‌‌‌​ పొజిషన్​

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ అందక ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్ కూడా దొరకని స్థితిలో ప్రోన్​ వెంటిలేషన్​ ద్వారా రక్తంలో ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ని పెంచుకోవచ్చు.  ఈ పద్ధతిలో మొదటగా మంచంపై బోర్లా పడుకుని తలకింద, పొట్టకింద, కాళ్లకింద దిండు పెట్టుకోవాలి. తలను ఎడమవైపుకు తిప్పి,చేతులను ముందుకు వంచి ఫ్రీగా ఉంచాలి. ఇలా ఉంటూ.. కాసేపు శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత దిండ్లు లేకుండా కుడి వైపుకు తిరిగి పడుకుని కాళ్లు, చేతులు బొమ్మలో ఉన్నట్టుగా పెట్టి పడుకోవాలి. బాగా ఊపిరి తీసుకోవాలి.ఈ పొజిషన్​లో అర్ధగంట ఉన్న తర్వాత లేచి కూర్చోవాలి. ఇలా అర్ధగంట ఉండి, మళ్లీ పడుకుని కుడి వైపుకు తిరిగి పడుకోవాలి. అర్ధగంట బాగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ మొదటి పొజిషన్​ (బోర్లా పడుకోవడం)లోకి రావాలి. 
ఇలా చేస్తే బ్లడ్​లో ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ లెవెల్​ని పెంచవచ్చు.