కరీంనగర్ లో ఎలుగుబంటి సంచారం..రాత్రి పూట గ్రామంలో తిరుగుతుండగా..సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

కరీంనగర్ లో ఎలుగుబంటి సంచారం..రాత్రి పూట గ్రామంలో తిరుగుతుండగా..సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

కరీంనగర్​ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గురువారం (అక్టోబర్​23) రాత్రి సైదాపూర్​మండల కేంద్రంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సైదాపూర్​ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతర గుట్ట సమీపంలో హుజూరాబాద్, సైదాపూర్​ రహదారిపై ఎలుగు బంటి తిరుగుతుండగా చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు పెట్టారు. ఎలుగుబంటి సంచారంపై అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు.