చెమట పట్టినా మేకప్‌‌ చెదర కూడదంటే..

V6 Velugu Posted on Apr 20, 2021

సమ్మర్‌‌‌‌లో చెమట తెగ చిరాకు పెడుతుంది. దానికి తోడు కరోనా పుణ్యమా అంటూ మూతికి మాస్క్‌‌ ఎక్స్‌‌ట్రా. మేకప్‌‌ వేసుకునే అలవాటు ఉన్నవాళ్లకి ఇది కాస్త ఇబ్బంది కరమే. అయితే సమ్మర్‌‌‌‌లో మేకప్‌‌ వేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్‌‌ ఫాలో అయితే మేకప్‌‌ చెక్కు చెదరకుండా ఉంటుంది. మేకప్‌‌ వేసుకునేందుకు ఎన్ని ఎక్కువ ప్రొడక్ట్స్‌‌ వాడాం అని కాదు. వాటిని ఎంత ట్రిక్కీగా వాడాం అన్నదే ఇంపార్టెంట్‌‌. సమ్మర్‌‌‌‌లో చెమట పట్టినా మేకప్‌‌ చెదరకుండా ఉండటమంటే కొంచెం కష్టమే. కానీ, అసాధ్యం కాదు. ఎండాకాలంలో లైట్‌‌ మేకప్‌‌ వేసుకుంటే బాగుంటుందంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. క్రీమీ ఫౌండేషన్‌‌ను పక్కనపెట్టి లైట్‌‌ కాంపాక్ట్‌‌ వాడితే బెటర్‌‌‌‌ అనేది వాళ్ల సలహా. మ్యాటీ లిప్‌‌స్టిక్‌‌ వాడితే లుక్‌‌ అదిరిపోతుందట. 
మాయిశ్చరైజర్‌‌‌‌ కంపల్సరీ 
చర్మం పొడి బారి ఆయిల్‌‌ గ్లాండ్స్‌‌ యాక్టివ్‌‌ అయ్యి ముఖం జిడ్డుగా  కనిపిస్తుంది. అందుకే, మేకప్‌‌కు ముందు మాయిశ్చరైజర్‌‌‌‌ రాస్తే మేకప్‌‌ ఎక్కువసేపు ఉంటుంది.
ప్రైమర్‌‌‌‌
మాయిశ్చరైజర్‌‌‌‌ తర్వాత మరో ఇంపార్టెంట్‌‌ కాస్మొటిక్‌‌ ప్రైమర్‌‌‌‌. హైలురోనిక్ యాసిడ్‌‌ ఉన్న  ప్రైమర్‌‌‌‌ వాడటం వల్ల మేకప్‌‌ సమంగా వస్తుంది. ఫేస్‌‌కూడా సాఫ్ట్‌‌గా కనిపిస్తుంది. 
బేస్‌‌ లేయర్స్‌‌
ఎండాకాలంలో బేస్‌‌ లేయర్స్‌‌ మందంగా వేసుకుంటే చెమట పట్టినప్పుడు ఇబ్బందిగా కనిపిస్తుంది. అందుకే, బ్యూటీ బ్లెండర్‌‌‌‌తో చాలా పలుచగా వేసుకోవాలి. మాస్క్‌‌ పెట్టుకున్నప్పుడు చాలా ఎక్కువగా చెమట పడుతుంది. అలాంటప్పుడు బేస్‌‌ మందంగా వేసుకుంటే పోర్స్‌‌ మూసుకుపోయే అవకాశం ఉంది. 
డెవీలుక్‌‌
ముఖంలోని టీ – జోన్‌‌ (నుదురు, ముక్కు) షైనీగా లేకుండా చూసుకోవాలి. మేకప్‌‌కి ముందు బ్లాటింగ్‌‌ పేపర్స్‌‌, బ్యూటీ స్పాంజ్‌‌లను వాడితే బెటర్‌‌‌‌. రీ టచ్‌‌ చేసుకునేటప్పుడు కూడా ముందుగా బ్లాటింగ్​ పేపర్‌‌‌‌తో క్లీన్‌‌ చేసి, ఆ తర్వాత ప్రెస్డ్‌‌ పౌడర్‌‌‌‌ వాడాలి. 
మస్కారా
వాటర్​ ప్రూఫ్​ కాని మస్కారా రెండు మూడు కోటింగ్‌‌లు వేసుకోవాలి. తర్వాత దానిపైన వాటర్‌‌‌‌ ప్రూఫ్‌‌ మస్కారాతో కోటింగ్‌‌ చేయాలి. ఇలాచేస్తే చెమట పట్టినప్పుడు  అది కళ్లపైన తగిలి, కళ్లు నల్లగా అవ్వవు. అంతేకాకుండా మేకప్‌‌ తీసేటప్పుడు కూడా ఈజీగా పోతుంది. 
ఐ - షాడో..
చెమట పట్టినా ఐ – షాడో పోకుండా ఉండాలన్నా, పొడలు లేకుండా కనిపించాలన్నా..  షాడో క్రీమ్‌‌కు బదులుగా ఐ – ప్రీమియర్‌‌‌‌ను పెట్టాలి.  దాంతో పాటు రెగ్యులర్‌‌‌‌ ఐ – లైనర్‌‌‌‌ వాడితే కళ్లు అందంగా కనిపిస్తాయి. 
లిప్‌‌బామ్‌‌..
లిప్‌‌స్టెయిన్‌‌పైన (జెల్​ లేదా లిక్విడ్‌‌ రూపంలో ఉండే లిప్‌‌స్టిక్‌‌) లిప్‌‌బామ్‌‌ వేసుకుంటే లిప్‌‌స్టిక్‌‌ చాలాసేపు ఉంటుంది. ఈ కాలంలో పింక్‌‌, పీచ్‌‌, క్రీమీ లిప్‌‌బామ్స్‌‌ వాడినా లుక్​ బాగుంటుంది.


 

Tagged beauty & makeup tips: sweat does not scatter makeup ..

Latest Videos

Subscribe Now

More News