సన్​స్క్రీన్​ వాడుతుంటే ఈ విషయాలు తెలుసుకోండి..

సన్​స్క్రీన్​ వాడుతుంటే ఈ విషయాలు తెలుసుకోండి..

ఎండలో బయటికి వెళ్లేముందు సన్​స్క్రీన్​ రాసుకుంటే అల్ట్రా వయొలెట్​ రేస్​ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు చర్మం ఫ్రెష్​గా ఉంటుంది. అయితే, అన్ని రకాల చర్మాలకి ఒకేరకం సన్​స్క్రీన్​ సరిపోదు.  వాడేముందు, కొనేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అంటోంది డెర్మటాలజిస్ట్​ గీతికా మిట్టల్​ గుప్తా.
ఎండలో వెళ్లేటప్పుడు కనురెప్పలు, చెవులు, మెడ వెనుక, చేతుల వెనుక, పాదాల మీద  సన్​స్క్రీన్​ రాసుకోవాలి. జిడ్డు, సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు కెమికల్​ లేదా జెల్​ బేస్డ్ సన్​స్క్రీన్ రాసుకుంటే మంచిది. 

వాటర్​ రెసిస్టెంట్ సన్​స్క్రీన్​ కొనాలి. ఇవి వాడితే చెమట ఎక్కువ పట్టినా లేదా నీళ్లు మీద పడినా  కూడా ఈ సన్​స్క్రీన్ పోదు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత జెల్​ బేస్డ్​ లేదా ఆయిల్​ బేస్డ్​ క్లెన్సర్​తో క్లీన్​ చేసుకోవాలి.  
సన్​ప్రొటెక్షన్​ ఫ్యాక్టర్​ (ఎస్​పిఎఫ్​) 100 ఉన్న సన్​స్క్రీన్స్, ఎస్​పిఎఫ్​ 50 వాటికంటే ఎక్కువ ప్రొటెక్షన్​ ఇస్తాయి. ఎస్​పిఎఫ్​ 30 ఉన్న సన్​స్క్రీన్స్​ రెండు మూడు సార్లు రాసుకుంటే చర్మం దెబ్బతినదు.