రగ్బీ ఆట నేర్పేందుకు దొంగగా మారిండు

రగ్బీ ఆట నేర్పేందుకు దొంగగా మారిండు

సికింద్రాబాద్​, వెలుగు: అతడో హోంగార్డ్​. రగ్బీ అంటే చాలా ఇష్టం. ఆ ఆటను ఇష్టపడేవాళ్లకు ఫ్రీగా ట్రైనింగ్​ ఇవ్వాలనుకున్నాడు. ఓ టీంను ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చాడు. అయితే, రానురాను ఆటకు సంబంధించిన బాల్స్​, స్పోర్ట్స్​ యూనిఫాం, ఇతర మెటీరియల్స్​కు డబ్బులు ఎక్కువయ్యేవి. వాటిని భరించే స్థోమత లేని అతడు, ఒకే రైల్వేస్టేషన్​, ఒకే రైలులో చైన్​ స్నాచింగ్​లు చేశాడు. పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. కేసు వివరాలను బుధవారం సికింద్రాబాద్​ రైల్వే ఆఫీసులో ఎస్పీ అనురాధ వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.లక్షన్నర, 116 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

బాసర స్టేషన్​.. నర్సాపూర్​ ఎక్స్​ప్రెస్​

మహారాష్ట్రకు చెందిన మోహన్​దేవ్​ రావు చవాన్​ (28).. నాందేడ్​ జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. రగ్బీ ఆటపై ఇష్టంతో టీమ్​ను తయారు చేసి ఫ్రీగా కోచింగ్​ ఇస్తున్నాడు. అయితే, వాళ్లకు అయ్యే ఖర్చుకు డబ్బుల్లేకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే నాందేడ్​ జిల్లా చిక్కల తండాకు చెందిన ప్రదీప్​ అనే వ్యక్తితో స్నేహం చేశాడు. ఇద్దరు కలిసి చైన్​ స్నాచింగ్​కు ప్లాన్​ వేశారు. అందుకు ఆదిలాబాద్​ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్​ను ఎంచుకున్నారు. అక్కడ సెకండ్​ ప్లాట్​ఫాంపై ఆగే నర్సాపూర్​ ఎక్స్​ప్రెస్​ను టార్గెట్​ చేసుకున్నారు. ఆ ఒక్క స్టేషన్​లోనే, ఆ ఒక్క రైల్లోనే 2018 ఫిబ్రవరి నుంచి చైన్​ స్నాచింగ్​లు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ ఒక్క ఏడాదే 8 స్నాచింగ్​లకు పాల్పడ్డారు. జనవరి 1, ఫిబ్రవరి 4న కూడా చోరీలు చేశారు. కొట్టేసిన నగలను ముంబైలో అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. మిగతా నగలను అమ్మేందుకూ మోహన్​దేవ్​రావు బుధవారం నిజామాబాద్​కు వచ్చాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్​ రైల్వే పోలీసులు స్టేషన్​లో తనిఖీలు చేశారు. మోహన్​దేవ్​రావును అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ప్రదీప్​తో కలిసి చైన్​ స్నాచింగ్​లకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. అతడిని రిమాండ్​కు తరలించారు. ప్రదీప్, నగలను కొన్న వారి కోసం గాలిస్తున్నారు. చైన్​ స్నాచర్​ను పట్టుకున్న నిజామాబాద్​ రైల్వే పోలీసులకు అనురాధ రివార్డులు అందజేశారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61