రాష్ట్రంలో తగ్గిన బీర్ల జోరు

రాష్ట్రంలో తగ్గిన బీర్ల జోరు

కరోనావైరస్ దెబ్బకు రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు బాగా తగ్గాయి. అదేంటి లాక్డౌన్ ఉన్నన్నాళ్లు మందు కోసం గోల చేసి.. ఇప్పుడు షాపులు ఓపెన్ అయిన తర్వాత మందు అమ్మకాలు తగ్గడమేంటి అనుకుంటున్నారా? అవును అదే నిజం. కరోనావైరస్ వ్యాప్తిస్తుండటంతో దేశమంతటా లాక్డౌన్ విధించారు. దాంతో ఉపాధి లేక జనాలు ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. అందుకే బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే ఇప్పుడు 44 శాతం తగ్గాయి. పైగా ప్రభుత్వం మద్యం ధరలు కూడా పెంచింది. లాక్డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటం.. మధ్యం ధరలు పెరగడమే బీర్ల అమ్మకాలు తగ్గడానికి కారణమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు డిస్టిలరీలు అంటున్నాయి. గత ఏడాది 2019 జూన్ ఒకటో తారీఖు నుంచి 17 వరకు సుమారు 30 లక్షల 20 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది 2020 జూన్ ఒకటి నుంచి 17 తేదీ అంటే నిన్నటి వరకు సుమారు 17 లక్షల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 44 శాతానికి బీర్ల అమ్మకాలు పడిపోయాయి.
బీర్ల అమ్మకాలు తగ్గడానికి కరోనా వైరస్ తో పాటు, ఆర్థిక పరిస్థితులు కూడా కారణమంటున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిస్టిలరీలు.

For More News..

టాయిలెట్ ను క్వారంటైన్ గా మార్చుకున్న యువకుడు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

కరోనావైరస్ ను చంపే ఛార్జింగ్ మాస్క్