
ఖిలా వరంగల్( కరీమాబాద్), వెలుగు: వరంగల్ సిటీలో ఆదివారం బీరన్న స్వామి బోనాలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేశాయిపేట, ఉర్సు కరీమాబాద్, రంగశాయిపేట బీరన్నస్వామి బోనాల్లో చీఫ్ గెస్ట్‌గా మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నగర ప్రజలకు బీరన్న బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై బీరన్న ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్లు కావేటి కవిత, మరుపల్ల రవి, గుండు చందన పూర్ణచందర్ పాల్గొన్నారు.