బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌ బరువు తగ్గిస్తుంది!

 బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌ బరువు తగ్గిస్తుంది!

బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌ కర్రీ చేసుకోవచ్చు. సలాడ్‌‌‌‌‌‌‌‌గా తినొచ్చు.  దీన్ని జ్యూస్‌‌‌‌‌‌‌‌ చేసుకొని తాగినా, సలాడ్‌‌‌‌‌‌‌‌లో తిన్నా ఇందులో ఉన్న నైట్రేట్స్‌‌‌‌‌‌‌‌, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. 

  • బ్లడ్ ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గడానికి నైట్రిక్‌‌‌‌‌‌‌‌ ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లో ఉండే నైట్రేట్స్‌‌‌‌‌‌‌‌ రక్తంలో కలిసి నైట్రిక్ ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌గా మారతాయి. తరువాత ఇవి రక్తంలో హెచ్చు తగ్గులు లేకుండా కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తాయి. దానివల్ల బ్లడ్‌‌‌‌‌‌‌‌ ప్రెజర్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. 
  • బీట్‌‌‌‌‌‌‌‌ రూట్ జ్యూస్‌‌‌‌‌‌‌‌లో ఫ్యాట్‌‌‌‌‌‌‌‌ ఉండదు. కాలరీలూ తక్కువే. అందుకే దీన్ని రోజూ ఉదయం స్మూతీలా తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ఎనర్జీ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా పనిచేస్తుంది. కండల కోసం బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌ జ్యూస్‌‌‌‌‌‌‌‌ తీసుకోవచ్చు. ఇందులో ఉన్న పొటాషియం, ఎలక్ట్రోలైట్స్‌‌‌‌‌‌‌‌ అందుకు సాయపడతాయి.
  •  బీట్‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లో బీటైన్‌‌‌‌‌‌‌‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఇది లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పట్టే ఫ్యాట్‌‌‌‌‌‌‌‌, పాయిజన్‌‌‌‌‌‌‌‌ను తొలగించి లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడుతుంది.