ఫారిన్ ట్రిప్​.. టూరిస్ట్ థింగ్స్

ఫారిన్ ట్రిప్​.. టూరిస్ట్ థింగ్స్

సెలవులు దొరికితే టూర్​ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. కొందరైతే ఏడాదికొకసారైనా ఫారిన్ ట్రిప్​ వేస్తారు. కానీ, మన దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడకు వెళ్లినా... వెళ్లే ప్లేస్​, ఆ చుట్టుపక్కల పరిసరాలు, అక్కడి ఆచారవ్యవహారాలు, రూల్స్​ ముందే తెలుసుకోవాలి. అప్పుడే ఎంత తెలియని ప్లేస్​కి వెళ్లినా ఏ ఇబ్బంది లేకుండా ఎంజాయ్​ చేయొచ్చు. ఎక్కువగా టూరిస్టులు వెళ్లే బాలి, కర్నాటకలకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సినవి ఏంటంటే...

బాలి వెళ్తుంటే...

ఇండియన్స్​కి పాపులర్​ హాలిడే డెస్టినేషన్​ అంటే బాలి గుర్తొస్తుంది. అయితే టూరిస్ట్​లకు కొత్త రూల్ తెచ్చింది అక్కడి గవర్నమెంట్. వాటిలో కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాల్సిందేనట. అవేంటంటే... 

  • లోకల్ కరెన్సీ అంటే ఇండోనేసియన్ రుపియానే వాడాలి. పేమెంట్స్ ఏవైనా ఇండోనేసియన్ రుపియాలోనే చేయాలి. 
  • ఫారిన్ ఎక్స్ఛేంజ్ చేయాలంటే  ఇండోనేసియన్ స్టాండర్డ్​ క్యూఆర్ కోడ్​ వాడాలి. ఆథరైజ్డ్​ బ్యాంక్​ల్లో ఫారిన్ కరెన్సీని ఎక్స్ఛేంజ్​ చేయాలి. 
  • బాలిలో సెల్ఫ్ డ్రైవ్​ ట్రిప్​ చేయాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్​ లైసెన్స్​ తప్పనిసరి.
  • రెంట్​కి వెహికల్స్​ కావాలనుకుంటే సర్టిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచే హైర్​ చేసుకోవాలి.
  • టూరిస్ట్​లు అకామిడేషన్​ బుక్ చేసుకోవాలంటే, హోటల్ లేదా విల్లా ఓనర్స్​కి పర్మిషన్స్ ఉన్నాయా? లేవా? అనేది డబుల్ చెక్​ చేసుకుని మరీ బుక్​ చేసుకోవాలి. 
  • రిజిస్టర్డ్​ హాటల్స్, విల్లాల్లో మాత్రమే బస చేయాలి.
  • టూరిస్ట్​లు ఎవరైనా సరే చివరి నిమిషంలో హడావిడి పడకుండా అరేంజ్​మెంట్స్ అన్నీ ముందుగానే పూర్తి చేసుకోవాలి.  
  • బాలిలో మౌంటైన్స్, ఓల్కనోల దగ్గర టూరిస్ట్​ యాక్టివిటీలను బ్యాన్ చేశారట! 

కర్నాటక ఎకో టూరిజం

టూరిస్ట్​ ప్లేస్​లకు వెళ్లినప్పుడు అక్కడ ట్రెక్కింగ్, కయకింగ్, రాఫ్టింగ్, బోటింగ్, వాటర్​ ఫాల్స్ దగ్గరకి వెళ్లడం, సఫారీ చేయడం వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అయితే ఇవి చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితేంటి? వాళ్లకు ఎలాంటి సాయం అందించాలనే దానిపై ఈ మధ్య కర్నాటకలో​ కొత్త రూల్ ఒకటి వచ్చింది. దాంతో అడ్వెంచర్స్ చేసే టూరిస్ట్​లకు మేలు జరుగుతుందట. ఆ రూల్​ ఏంటంటే... 

టూరిస్ట్​ ప్లేస్​కి వెళ్లినప్పుడు టికెట్​ కొంటాం కదా... ఆ టికెట్ కొన్న వాళ్లందరికీ బీమా కవరేజీ ఇవ్వాలని . కర్నాటకలోని ఎకో – టూరిజం టూరిస్ట్​లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట.  టైగర్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌లు, వైల్డ్ లైఫ్​ శాంక్చురీలు, నేషనల్ పార్క్​లు, కర్నాటక ఫారెస్ట్​లు వంటి ఎకో టూరిజం డెస్టినేషన్స్​కి ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే వాటర్ యాక్టివిటీస్​లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి, అలాంటప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి యాక్టివిటీలు చేసేవాళ్లకు ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే కొన్ని కేసులకు మాత్రం ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ నుంచి స్టేట్ రిలీఫ్ ఫండ్​ అందుతుంది. 

ఎక్కువ ఫొటోలు ఇక్కడే!

అందమైన ప్రదేశాలు, కట్టడాల దగ్గర ఫొటోలు తీసుకోవడం టూరిస్ట్​లకు సరదా. ఎక్కువగా ఫొటోలు తీసుకునే టూరిస్ట్ అట్రాక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి...

  • న్యూయార్క్​లోని సెంట్రల్​ పార్క్​.. కొన్ని టెక్నిక్స్​ వాడి లాండ్​స్కేప్ ఆర్కిటెక్చర్​తో డిజైన్​ చేసిన మొదటి పబ్లిక్​ పార్క్​ ఇది.  
  • రియో డి జెనిరోలో సుగర్ ​లోఫ్​ మౌంటెన్​ ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లకు నేచర్​ ఇచ్చిన గిఫ్ట్​గా చెప్తుంటారు. అంత అందంగా ఉంటుంది ఈ ప్లేస్​. 
  • లండన్​లోని బకింగ్​హామ్​ ప్యాలెస్. దానికున్న చరిత్ర, ఆర్కిటెక్చర్​ ప్రపంచవ్యాప్తంగా ట్రావెలర్స్​, ఫొటోగ్రాఫర్స్​ని అట్రాక్ట్ చేస్తుంటుంది. 
  • ఈజిప్ట్​లోని గిజా పిరమిడ్స్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. కాబట్టి అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఫొటో తీసుకోవడం చాలా మామూలు విషయం.
  • న్యూయార్క్​లో మరో అట్రాక్షన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్​. దీని ఆర్కిటెక్చర్​కి చాలా గుర్తింపు ఉంది. ఇది కూడా వరల్డ్ మోస్ట్​ ఫొటోగ్రాఫ్డ్​ బిల్డింగ్స్​లో ఒకటి. 
  • ఇంకా శాన్​ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఆస్ట్రేలియాలోని ఉలురు అనే కల్చరల్ లాండ్​స్కేప్, దుబాయి​లో బుర్జ్​ ఖలీఫా వంటివి ఈ లిస్ట్​లో ఉన్నాయి.