51మందికే బీఫామ్స్.. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్

51మందికే బీఫామ్స్.. ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్స్‌ అందజేశారు. బీఆర్ ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి తరపున కల్వకుంట్ల కవిత బీఫామ్ అందుకున్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్శన్ బీఫామ్ అందుకున్నారు. ప్రస్తుతం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్స్ అందజేశారు.. మిగతావారికి మరో రెండు రోజుల్లో  బీఫామ్‌లు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీఫామ్ డిస్ట్రిబూషన్ తర్వాత పార్టీ మేనిఫెస్టును కేసీఆర్ విడుదల చేస్తారు. 

అయితే ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొంతమందిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తప్పని సరి పరిస్థితుల్లో కొందరు అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని కేసీఆర్ ప్రకటించారు. 

దీంతో మిగతా అభ్యర్థుల్ల టెన్షన్ మొదలైంది. అభ్యర్థులను మార్చే లిస్టులో ఆలంపూర్, కోదాడ, కొత్తగూడెం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఈస్ట్ లోనూ అభ్యర్థిని మారుస్తారని ప్రచారం సాగుతోంది.