
మెట్రో ఫ్లైఓవర్ పూర్తయి మెట్రో రైళ్లు సేవలందిస్తూ నెలలు గడుస్తున్నా బేగంపేటలో నిర్మించిన ఫుట్వాక్ ఫ్లై ఓవర్ మాత్రం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో పాదచారులు రోడ్డు దాటేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్–పంజాగుట్ట రోడ్డులోని ప్రస్తుత పరిస్థితి.