మానవత్వం చాటిన పోలీసులు

మానవత్వం చాటిన పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటారు. ఆదివారం ఉదయం బ్రూక్ బాండ్ జంక్షన్ వద్ద రెండు బైకుల మధ్య జరిగిన ప్రమాదంలో ఇంద్రేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్​ టి.సురేశ్, మొబైల్ ఏఆర్పీసీ కె.సురేశ్, హెచ్‌‌‌‌జీ సయ్యద్ మియా గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి సమీప హాస్పిటల్​కు తరలించారు.