
చైనాలో గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ తన ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లో రెండు నెలలుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో బీజింగ్‌ను కరోనా ఫ్రీగా ప్రకటించాలని ఆ దేశం నిర్ణయం తీసుకునే సమయంలో…మరోసారి వైరస్ వ్వాపించి కలకలం సృష్టించింది. నిన్న(గురువారం) మొదటి వైరస్ కేసు నమోదు అయ్యింది. ఇవాళ(శుక్రవారం) మరో రెండు పాజిటివ్ కేసులు నమొదయ్యాయి. గత 24 గంటల్లో బీజింగ్‌లో రెండు కేసులు నమోదైనట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ వారంలో కేసుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో చైనా మీట్ ఫుడ్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ సెంటర్‌లో పని చేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తేలింది. మరోవైపు ఓ స్కూలు విద్యార్థి తండ్రికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ స్కూల్లోని సుమారు 50 మంది విద్యార్థులు, టీచర్లను క్వారంటైన్‌కు ఆదేశించారు. తర్వాత స్కూలు మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు.