చైనాలో మళ్లీ కరోనా కలకలం

చైనాలో మళ్లీ కరోనా కలకలం
  • బీజింగ్ లో రెండు నెలల తర్వాత కొత్త కేసులు
  • లోకల్ ట్రాన్స్ మిషన్ అవుతున్నట్లు గుర్తింపు…మళ్లీ లాక్ డౌన్ యోచన

బీజింగ్ : చైనా లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. వైరస్ ను దాదాపు కంట్రోల్ చేశామని భావిస్తున్నప్పటికీ కొత్త కేసులు నమోదవుతుండటం అధికారులను పరేషాన్ చేస్తోంది. మూడు రోజుల్లో కొత్తగా 18 కేసులు నమోదైనట్లు శనివారం అధికారులు ప్రకటించారు. ఇందులో ఒక్క బీజింగ్ సిటీలోనే 9 కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులు బీజింగ్ లోని అతిపెద్ద మాంసం మార్కెట్ జీన్ ఫడితో లింకై ఉన్నాయి. ఈ మార్కెట్లో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు, ఒక విజిటర్, మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా కన్ ఫర్మ్ అయ్యింది. వీరందరికీ ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవటంతో మళ్లీ కరోనా లోకల్ ట్రాన్స్ మిషన్ మొదలైందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు జీన్ ఫడి సహా బీజింగ్ లోని ఆరు మాంసం మార్కెట్లను క్లోజ్ చేశారు. మార్కెట్ కు దగ్గర్లోని 11 రెసిడెన్షియల్ ఏరియాలను మూసేశారు. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే మళ్లీ బీజింగ్ లో లాక్ డౌన్ విధించవచ్చని అంచనా వేస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా బీజింగ్ లో కరోనా కొత్త కేసులు లేవు. విదేశాల నుంచి వచ్చిన వారికి తప్ప లోకల్స్ కు కరోనా సోకలేదు. శనివారం కొత్త కేసులు గుర్తించటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

కరోనా ముప్పు పొంచి ఉంది

లోకల్ ట్రాన్స్ మిషన్ అయినట్లు గుర్తించటంతో చైనా నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు కరోనా ముప్పు ఇంకా పొంచే ఉందని చెప్పారు. కరోనా సెకండ్ స్టేజ్ కు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ లోకల్స్ ను కోరారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు. లక్షణాలు లేకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయని…ఈమధ్యనే అలాంటి ఏడు కేసులను గుర్తించినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రజలు మాస్కులు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని కోరారు. కొత్త కేసులు వస్తుండటంతో చైనా లో 1 నుంచి 3 వ తరగతుల వరకు స్కూల్స్ ను మూసి వేయాలని భావిస్తోంది.

Beijing Wholesale Market Temporarily Shut Over New COVID-19 Cases