ఫిఫా వరల్డ్ కప్ నుంచి బెల్జియం అవుట్

ఫిఫా వరల్డ్ కప్ నుంచి బెల్జియం అవుట్

అహ్మద్బిన్ అల్ స్టేడియం: భారీ అంచనాలతో బరిలోకి దిగిన వరల్డ్ రెండో ర్యాంకర్​ బెల్జియంకు ఫిఫా వరల్డ్​ కప్​లో ఊహించని షాక్ తగిలింది. గురువారం జరిగిన గ్రూప్–ఎఫ్​లో క్రొయేషియాతో కచ్చితంగా గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్​ను  బెల్జియం 0–0తో డ్రా చేసుకుంది. దీంతో ఈ గ్రూప్​లో ఒకే ఒక్క విజయంతో  బెల్జియం 4 పాయింట్లతో మూడో ప్లేస్​కు పరిమితమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బెల్జియం స్టార్ ప్లేయర్ రొమేలు లుకాక్​ను కట్టడి చేయడంలో క్రొయేషియా సూపర్ సక్సెస్ అయ్యింది. తొలి హాఫ్​లో క్రొయేషియాకు కేటాయించిన ఓ పెనాల్టీ వివాదాస్పదమైంది.

మ్యాచ్ మధ్యలో లుకాక్​ను  తీసుకొచ్చి అటాకింగ్ పెంచినా మూడు కీలక సమయాల్లో అతను గోల్స్ కొట్టలేకపోయాడు. మొత్తానికి ఈ టోర్నీలో బెల్జియం నాలుగు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. మొత్తం నాలుగు మార్పులతో బరిలోకి దిగిన బెల్జియం ఈ మ్యాచ్​లో అవకాశాలను సృష్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మరో మ్యాచ్​లో మొరాకో 2–1తో కెనడాపై గెలిచి టాప్ ప్లేస్ (7 పాయింట్లు)తో ప్రిక్వార్టర్స్​కు చేరుకుంది. కెనడా ప్లేయర్ నైయఫ్ అగుర్డ్ (40వ ని.) ఓన్ గోల్ చేయగా, మొరాకో తరఫున యూసెఫ్ ఎన్ ఎన్సారి (23వ ని.), హకీమ్ జైచ్ (4వ ని.) గోల్ చేశారు. ఈ టోర్నీలో కెనడా ఒక్క పాయింట్  కూడా చేయలేదు.