బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘కిష్కింధపురి’. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుష్మిత కొణిదెల అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. భయపెట్టడం కూడా ఒక ఆర్ట్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియెన్స్ లీనమైపోతారు.
చూసిన ప్రతి ఒక్కరూ ‘కిష్కింధపురి 2’ ఎప్పుడని అడుగుతారు. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయింది. చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. కానీ కొంచెం వెలితిగా కూడా ఉంది. అది ఈ చిత్రంతో తీరిపోతుందని భావిస్తున్నా’ అని అన్నాడు. సాయి, నేను నటించిన ‘రాక్షసుడు’ తరహాలో ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనుపమ చెప్పింది.
ఈ చిత్రం తమ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకం ఉంది అని డైరెక్టర్ కౌశిక్ అన్నాడు. ఈ సినిమా హాలీవుడ్ స్టాండర్డ్‌లో ఉంటుందని, సాయి, అనుపమ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నిర్మాత సాహు గారపాటి చెప్పారు.
