OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Horror Thriller: ఓటీటీలోకి తెలుగు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సమయంలోనే శుక్రవారం (అక్టోబర్ 10న) ఓటీటీ అప్డేట్ అధికారికంగా అనౌన్స్ అయింది. దీపావళి కానుకగా (అక్టోబర్ 17) సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి, బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ రొటీన్‌కు భిన్నంగా భయపెట్టింది. కథనంలో వైవిద్యం,ఆడియన్స్ను భయపెట్టేలా తెరపై కొత్తగా ప్రజెంట్‌ చేసిన విధానం సినిమాకు కలిసొచ్చాయి. రాక్షసుడు వంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత, బెల్లంకొండ, అనుపమ కలయికలో కిష్కింధపురి వచ్చి సక్సెస్ కంటిన్యూ చేసింది. త్వరలో ఈ జంట రాక్షసుడు 2తో ఆడియన్స్ను పలకరించనుంది !!

కథేంటంటే:

రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్‌లను చూపించే గైడ్స్. ఔత్సాహికులను పాడుబడ్డ భవనాల్లోకి తీసుకెళ్లి అక్కడి దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పి వాళ్లను భయపెట్టడమే వీళ్ల ప్రొఫెషన్. అలా ఓసారి సువర్ణమాయ అనే మూతపడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు ఎనిమిది మంది ఔత్సాహికులు వస్తారు. కానీ ఈసారి అక్కడ నిజమైన దెయ్యం ఎదురుపడుతుంది.

రేడియోలోని వాయిస్‌తో వాళ్లను భయపెడుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతారు. కానీ ఆ దెయ్యం వార్నింగ్ ఇచ్చినట్టుగానే అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కక్కరూ చనిపోతుంటారు. ఇంతకూ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? తన గతం ఏమిటి? ఎందుకలా చంపుతోంది? దాని బారి నుంచి మిగతా వాళ్లను కాపాడటానికి రాఘవ్ ఏం చేశాడనేదే మిగతా కథ.