బెల్లంపల్లి, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేను బుధవారం న్యూఢిల్లీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్పార్టీ కార్యక్రమాలు, బలోపేతంపై వినోద్ ఖర్గేతో చర్చించారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.
