నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : ఎమ్మెల్యే వినోద్

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి : ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ​సూచించారు. వన మహోత్సవంలో భాగంగా కన్నెపల్లి మండలంలోని చర్లపల్లి ప్రైమరీ స్కూల్, భీమిని మండలంలోని జడ్పీ స్కూల్​లో వన ఎమ్మెల్యే వినోద్ స్థానిక నాయకులతో కలిసి మొక్కలను నాటారు. జగ్గయ్యపేటలో ఎండోమెంట్​ కింద నిర్మించిన శివకేశవ ఆలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు.

 అనంతరం మండల ప్రజల సౌకర్యం కోసం మంచిర్యాల నుంచి భీమిని మండల కేంద్రానికి నడిచే ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బెల్లంపల్లి మార్కెట్​కమిటీ మాజీ వైస్ ​చైర్మన్​ నర్సింగరావు, డీఆర్​డీవో పీడీ కిషన్, ఎంపీడీవో గంగామోహన్, కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.