
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్‌కు చెందిన అండర్ 14 క్రికెటర్ రిత్విక్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్(క్యాప్) నిర్వహిస్తున్న స్కాలర్‌షిప్ పోటీలకు రిత్విక్ ఎంపికయ్యాడు. రిత్విక్ ప్రస్తుతం స్థానిక
శ్రీ చైతన్య స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా రిత్విక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పోటీలకు తాను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఆ తర్వాత రూ.2 లక్షల స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉందని తెలిపాడు.