
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా నిన్న రాత్రి రాజీవ్ గాంధీ ఇంటర్నేష్నల్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. తిమింగలం ఆకారంలో ఉన్న ఈ బెలూగా ప్లేన్ కోల్‌కతాలోని జాయ్ సిటీ నుంచి వచ్చింది. 56 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానాన్ని ఫొటోలు తీసిన పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో నిన్న రాత్రినుంచి తెగ వైరల్ అవుతుంది. సరుకు రవాణాకి ఉపయోగించే ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ఆర్జీఐఎ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.