ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జీవితం డాక్యుమెంటరీ సినిమాగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ బెన్ స్టోక్స్ లైఫ్ ను మూవీగా తీసింది. తీసింది. బెన్ స్టోక్స్ డాక్యుమెంటరీ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజైంది. 3 నిమిషాల ట్రైలర్లో బెన్ స్టోక్స్కు తన క్రికెట్ కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాలను చూపించారు.
మెంటల్ రిలాక్సేషన్ కోసం లాస్ట్ ఇయర్ క్రికెట్ నుంచి బెన్ స్టాక్స్ విరామం తీసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ పరిస్థితిలో స్టోక్స్ మెంటల్ కండీషన్ ఎలా ఉందో..వివరించాడు. స్టోక్స్ మళ్లీ క్రికెట్ ఆడటం చూస్తాననుకోలేదని సహచర ఆటగాడు బ్రాడ్ పేర్కొన్నాడు. స్టోక్స్లోని ఎన్నో గొప్ప విషయాలను చాలా మంది చూడలేకపోయారని జో రూట్ అన్నాడు. అతను ఎంత గొప్పోడో తనకు తెలుసని చెప్పాడు. అంతేకాదు 2017లో బ్రిస్టల్‌లోని నైట్‌క్లబ్ దగ్గర గొడవ గురించి కూడా ట్రైలర్లో చూపించారు. ఈ ఘటన తర్వాత ఇంగ్లాండ్ యాషెస్ జట్టులో స్టోక్స్ స్థానం కోల్పోయాడు. పోలీసులు స్టోక్స్‌ను అరెస్టు చేసి విచారించారు. ఆ తర్వాత జరిమానా, 8 మ్యాచ్‌ల నిషేధంతో అతను జైలు నుంచి బయటికొచ్చాడు. ఆగస్టు 26న ప్రైమ్ వీడియోలో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవనుంది.
Official Trailer: ??? ??????: ??????? ???? ??? ?????
— Amazon Prime Video Sport (@primevideosport) July 28, 2022
Coming to Prime Video on 26 August ?? pic.twitter.com/Pbysscty3O
బెన్ స్టోక్స్ డాక్యుమెంటరీ మూవీ 2 గంటల ఉండనుంది. రెడ్ బుల్ కంపెనీ ఈ మూవీకి స్పాన్సర్ చేయగా.. అమెజాన్ ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తుంది. ఈ డాక్యుమెంటరీ కోసం స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ల ఇంటర్వ్యూలు తీసుకునేందుకు అమెజాన్ ప్రైమ్ ..ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకుంది. ట్రైలర్‌పై ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. డాక్యుమెంటరీ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
బెన్ స్టోక్స్ విషయానికి వస్తే.. 31ఏళ్ల ఈ ఆల్‌రౌండర్..ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ గా ఉన్నాడు. ఐసీసీ టెస్ట్ ఆల్-రౌండర్ల జాబితాలో స్టోక్స్ ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. అంతేకాదు..ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ పాత్ర మరవలేనిది.
