భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన లబ్ధిదారులు

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన లబ్ధిదారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అనర్హులకు డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ కొత్తగూడెం టౌన్​కు చెందిన లబ్ధిదారులు సోమవారం స్థానిక కలెక్టరేట్​ముట్టడికి యత్నించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇండ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన చేశారు. ఆఫీసర్లు, బీఆర్ఎస్​కౌన్సిలర్లు కుమ్ముక్కై తమ బంధువులు, అనుచరులకు ఇప్పించుకుంటున్నారని వాపోయారు.

కలెక్టరేట్​లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న డీఆర్ఓ అశోక్ చక్రవర్తి ఆందోళనకారుల వద్దకు వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించారు. లబ్ధిదారులు ఆయనతో వాగ్వావాదానికి దిగారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్​ముందే ఆత్మహత్య చేసుకుంటామని పలువురు మహిళలు హెచ్చరించారు. అనర్హులు ఉంటే గుర్తించి తొలగిస్తామని, ఎంపిక చేసిన లిస్ట్​ను మరోసారి పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం అధికారులు కొత్త అప్లికేషన్లు తీసుకున్నారు.