ఖర్బూజా వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ఖర్బూజా వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

వేసవి వచ్చేస్తోంది, ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవిలో ఎండ తీవ్రత వల్ల డిహైడ్రేషన్, వడ దెబ్బ, వంటి సమస్యలనుండి మనల్ని మనం కాపాడుకోవటానికి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వేసవిలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ ని మన డైట్లో చేర్చుకోవటం వల్ల అటువంటి సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన అలాంటి న్యాచురల్ మెడిసిన్స్ లో ఒకటి ఖర్బూజా. మనం వేసవిలో ఎక్కువగా తీసుకునే ఖర్బూజా వాల్ల్ మనకు తెలియని చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అత్యధిక పోషక విలువలు:

ఖర్బుజాలో మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో విటమిన్ K, B, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇవి బోన్ హెల్త్ ని కాపాడతాయి, ఎలెక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసి ఎనర్జిటిక్ గా ఉండటం కోసం తోడ్పడతాయి.

 హైడ్రాటెడ్ గా ఉంచుతుంది:

ఖర్బూజాలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల, క్రమం తప్పకుండా వీటిని తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ కి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్ విలువలు:

ఖర్బూజాలో యాంటీ ఆక్సిడెంట్ విలువలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండ తీసుకోవటం వల్ల హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండచ్చు. అంతే కాకుండా సెల్ డ్యామేజ్ కాకుండా కూడా కాపాడుతుంది.

జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది:

ఖర్బూజాను క్రమం తప్పకుండా మన డైట్లో చేర్చుకోవటం వల్ల డిజేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వీటిలో ఫ్రూక్టోజ్ వంటి న్యాచురల్ షుగర్స్ ఉండటం వల్ల డైజెస్టివ్సిస్టమ్ ను హెల్తీగా ఉంచటంలో తోడ్పడుతుంది.

వెయిట్ మేనేజ్మెంట్ :

బరువు పెరగకుండా ఉండాలన్న, తగ్గకుండా ఉండాలన్నా ఖర్బుజా రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇవి తియ్యగా ఉన్నప్పటికీ  వీటిలో క్యాలరీస్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటివి చాలా తక్కువ శాతంలో ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా తిన్నా కూడా బరువు పెరిగే సమస్య ఉండదు.