పవర్ ప్లాంట్ ప్రమాదం ఏపీకి లాభమా?

పవర్ ప్లాంట్ ప్రమాదం ఏపీకి లాభమా?
  • శ్రీశైలం ప్లాంట్ కు నీళ్లు ఆపాలంటూ పదే పదే ఫిర్యాదులు చేసిన ఏపీ
  •  రిజర్వాయర్లో నీటి లెవల్ ఎక్కువగా ఉంచాలని కృష్ణా బోర్డుపై ఒత్తిడి
  •  ఈ టైమ్ లోనే  పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం..
  • కొంతకాలం షట్ డౌన్ ఇది ఏపీకి కలిసొచ్చేలా ఉందంటున్న ఇంజనీర్లు

శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏపీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇది అనుకూలంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకాలంగా కృష్ణా నీళ్లను మళ్లించుకునే ఏపీ అక్రమ ప్రాజెక్టులన్నింటికీ ప్రధాన అడ్డుగోడగా..తెలంగాణ తరఫున ప్రధానవాదనగా శ్రీశైలం పవర్ ప్లాంట్ వెలుగులు జిమ్మింది. పవర్ ప్లాంట్కు నీటి వినియోగమే ఏపీ ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టేందుకు అవకాశమిచ్చింది. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంతో శ్రీశైలం ప్లాంట్ కొంతకాలం షట్ డౌన్ కానుంది. ఎప్పుడు రిపేర్లవుతా యి, ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రమాదానికి కారణాలేవైనా… పవర్ ప్లాంట్కు నీటిని ఆపాలంటూ కృష్ణా బోర్డుపై ఒత్తిడి చేయడం, సంగమే శ్వరం స్పీడ్గా కట్టేందుకు ముహూర్తం చూసుకోవటం కోసం ఏపీ ఆశించినట్లుగా జరుగుతోందా? వాళ్లు వేసిన ఎత్తుగడ పారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నా యి. శ్రీశైలం ప్లాంట్ దెబ్బతింటే, అక్కడ కరెంటు ఉత్పత్తి నిలిచిపోతే ఏపీకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విద్యుత్ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఎక్స్పర్టులుఅంటున్నారు.

బోర్డుపై ఒత్తిడి చేసిన ఏపీ

శ్రీశైలం రిజర్వాయర్లో చుక్క నీళ్లు మిగలకుండా కృష్ణా నీళ్లను మళించుకునేందుకు ఏపీ పక్కా ప్లాన్ తో అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడు గండి డబుల్ చేయడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ నిర్మించేందుకు రెడీ అయింది. వాటికి నీళ్లన్ని తీసుకునేందుకు.. శ్రీశైలం నీటి వాటాల పంపిణీపై పెత్తనం ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే ఎడమ గట్టున ఉన్న తెలంగాణ పవర్ ప్లాంట్కు నీటి విడుదల ఆపాలంటూ జులై 20న కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. దిగువన ఇరిగేషన్ అవసరాలేమీ లేనందున కరెంటు ఉత్పత్తి కోసం నీటి విడుదల ఆపాలంటూ అభ్యంతరం చెప్పింది. కృష్ణా బోర్డు మెంబర్ సెక్రెటరీకి, ఇరిగేషన్ ఈఎన్సీకి, తెలంగాణ జెన్ కోకు లెటర్ రాసింది. అయితే రాష్ట్ర సర్కారు నీటి విడుదల ఆపకుండా కరెంటు ఉత్పత్తి కొనసాగించటం ఏపీకి కంటగింపుగా మారింది. వరుస మెసే జ్ లతో కృష్ణా బోర్డుపై ఒత్తిడి పెంచింది. దీంతో కృష్ణా బోర్డు తెలంగాణ పవర్ ప్లాంట్కు నీళ్లు తీసుకోవడం ఆపేలా ఆదేశించాలంటూ కృష్ణా బోర్డు ఆగస్టు 6న కేంద్ర జలశక్తికు లెటర్ రాసింది. అంటే తెలంగాణ పవర్ ప్లాంట్కు నీటి విడుదలను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించిందనే దానికి ఇదంతా నిదర్శనంగా మారింది. అలాంటిది పవర్ ప్లాంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏపీకి మేలుకు చేకూర్చినట్టయింది. పవర్ప్లాంట్ ఆగిపోయి, ఏపీకి ఆశించినంత వెసులుబాటు దొరికిందని.. ఇరిగేషన్ ఇంజనీరలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రాజెక్టులు చక్కదిద్దు కునే ఎత్తుగడ!

శ్రీశైలం నీళన్నీ తోడుకుపోయేలా ఏపీ సర్కారు డిజైన్ చేసుకున్న సంగమేశ్వరం లిఫ్ట్పనులకు ఈ నెల 19నే టెండర్లు పూర్తయ్యాయి. దీనితోపాటు పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేసే పనులకు ఏపీ ముహూర్తం చూసుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంది. రోజుకు 8 నుంచి 11 టీఎంసీల నీటిని ఏపీమళిం్ల చుకుంటే.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చుక్కనీళ్లు కూడా దక్కని ముప్పు ముంచుకొస్తుంది. అయితే ఇదే టైంలో శ్రీశైలం ఎడమ గట్టున ఉన్న మన పవర్ ప్లాంట్కునీటిని ఆపేయాలని ఏపీపదేపదే కోరటం అనుమానాలకు తావిస్తోంది. విషయాన్ని డైవర్ట్ చేసి.. ఇక్కడి నీటి వాటాల పంపిణీని రహస్యంగా ఉంచటం, అక్రమంగా తాము కట్టే ప్రాజెక్టులకు చకచకా పూర్తి చేసుకోవడమే ఏపీలక్ష్యమనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఏపీ ప్లాన్కు తగ్గట్టుగానే.. శ్రీశైలం లెఫ్ట్పవర్ ప్లాంట్మూతపడే పరిస్థితి తలెత్తడం తెలంగాణకు అశనిపాతంగా మారింది. ఈ ప్రమాదం, దానివల్ల ఎఫెక్ట్ ఇతర అంశాలపై చర్చ జరుగుతుండగానే.. ఏపీ తమ పని చక్కబెట్టుకునే చాన్స్ ఉందన్న వాదన వినిపిస్తోంది.

ఆరు నెలలు ఆగినట్టే ..

ప్లాంట్ లో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 150 మెగావాట్ల చొప్పున 900 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి కెపాసిటీ ఉంది. నీటి ప్రవాహం ఎక్కు వగా ఉన్న సీజన్ కావటంతో రోజూ పూర్తిస్థాయిలో కరెంట్ ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ఫైర్యాక్సిడెంట్లో నాలుగు యూనిట్లు దెబ్బతిన్నాయి. ఇందులో రెండు యూనిట్లుపూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ నాలుగు యూనిట్లను కూడా ఇప్పటికిప్పుడు రెడీ చేసే పరిస్థితి లేదు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని జెన్కో వర్గాలే అంచనా వేస్తున్నాయి. సేఫ్గా ఉన్న మిగతా రెండు యూనిట్లను 15 రోజుల్లో రన్ చేస్తామని జెన్కో సీఎండీ ప్రకటించారు. కానీ నెల రోజులకుపైగా పట్టొచ్చని ప్లాంట్ లో పనిచేసిన స్టాఫ్ చెప్తున్నారు. మొత్తంగా రోజుకు రూ.15 కోట్ల చొప్పున ఆగస్టు, సెప్టెంబర్ పీక్ సీజన్ లో.. కనీసం రూ.750 కోట్ల మేర కరెంటును జెన్ కో నష్టపోతుందనే అంచనాలు ఉన్నాయి.