జై శ్రీరామ్‌‌ నినాదాలు చేసిన పది మంది అరెస్ట్‌‌

జై శ్రీరామ్‌‌ నినాదాలు చేసిన పది మంది అరెస్ట్‌‌

కోల్‌‌కతా: పశ్చిమబెంగాల్‌‌ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌‌ను అడ్డుకుని ‘జై శ్రీరామ్‌‌’ అంటూ నినాదాలు చేసిన పది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోక్‌‌సభ ఎలక్షన్స్‌‌ ఫలితాల తర్వాత తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ కార్యకర్తలపై దాడులకు నిరసనగా 24 పరగణాల జిల్లా నైహటిలో ధర్నా చేసేందుకు వెళ్తున్న మమతా బెనర్జీ కాన్వాయ్‌‌ను బీజేపీ కార్యకర్తలు గురువారం అడ్డుకున్నారు. ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో దీదీ వాళ్లపై సీరియస్‌‌ అయ్యారు. కారు దిగొచ్చి వార్నింగ్‌‌ ఇచ్చారు. నినాదాలు చేసిన కార్యకర్తల వివరాలు నోట్‌‌ చేసుకోమని, వాళ్లపై యాక్షన్‌‌ తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.