బెంగాల్ ఘటన దేశానికే అవమానకరం..మీకు అండగా ఉంటా: బెంగాల్ గవర్నర్

బెంగాల్ ఘటన దేశానికే అవమానకరం..మీకు అండగా ఉంటా: బెంగాల్ గవర్నర్

కోల్ కతాలో జూనియర్ డాక్టర్  రేప్ అండ్ మర్డర్ ఘటన బెంగాల్ తో పాటు  దేశానికే అవమానకరమన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్.  డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 14న కొంతమంది విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇవాళ ఉదయం  ఆర్జీకర్ ఆస్పత్రిని గవర్నర్  సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడిన ఆయన.. ఆస్పత్రిలో విధ్వంసం పౌరసమాజానికి సిగ్గు చేటన్నారు. తాను మీతోనే ఉన్నానని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

 కొంతమంది పోలీసులే కేసును నిర్వీర్యం చేయడానికి కుట్రదారులుగా మారడం దారుణమన్నారు గవర్నర్ ఆనంద బోస్.  జూనియర్ డాక్టర్  రేప్ అండ్ మర్డర్ కు బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేసు సంబంధించిన వివరాలను సీఎం మమత సర్కార్ దాచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ ఘటన సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు గవర్నర్ ఆనంద బోస్.  

ఆగస్టు 10న జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి హత్య  చేసిన సంగతి తెలిసిందే. ఆమె శరీరంలో వీర్యకణాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో  వెల్లడైంది. తమ కూతురిని గ్యాంగ్ రేప్ చేసి చంపినట్లు ఆమ తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ వేశారు.