వామ్మో.. వీడు మామూలోడు కాదు.. అన్నం ఎక్కడ తింటున్నాడో చూడండి..

వామ్మో.. వీడు మామూలోడు కాదు.. అన్నం ఎక్కడ తింటున్నాడో చూడండి..

వారం క్రితం వర్షాలు పడ్డాయి.  ఇప్పుడు మళ్లీ మొహం చాటేశాయి.  ఇక వేడి.. ఉక్కపోత ఎండాకాలం కంటే దారుణంగా ఉంది.  కొన్ని ప్రాంతాల్లో వేడికి జనాలు తట్టుకోలేకపోతున్నారు.  ఏసీలు.. కూలర్​ లు కూడా పని చేయడం లేదు.  కోల్​కతాలోని నార్త్ 24 పరగణాల అశోక్‌నగర్ లో ఓ వ్యక్తి ఎండకు తట్టుకోలేక చేసిన పనిని చూస్తే జనాలకు నవ్వొస్తుంది.  ఘోష్​ అనే వ్యక్తి ఏకంగా చెరువునే డైనింగ్​ హాల్​ చేశాడు. 

కోల్​కతాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి.  వేడికి.. ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. వేడికి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు.  చిరాకుగా ఉండటంతో అన్నం కూడా తినలేకపోతున్నారు.  నార్త్ 24 పరగణాల అశోక్‌నగర్ లో విసిరి  బెల్లాస్​ గార్డెన్​ లో ఓ చెరువు ఉంది.  అయితే శిబు ఘోష్  వ్యక్తి వేడినుంచి ఉపశమనం పొందేందుకు ఆ చెరువులో  కూర్చుని అన్నం ప్లేట్​ తీసుకొని తిన్నాడు.  ఇలా వేసవిలో సేద తీరుతూ ఉపశమనం పొందాడు. ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అయింది .బుధవారం ( జూన్​ 19) కోల్​కతాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఎండకు తట్టుకోలేక పోతున్నారు.  కోల్​కతా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.  రుతుపవనాలు వచ్చిన తర్వాత కూడా, దక్షిణ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు.

ఘోష్​ కుటుంబం  విసిరి బెల్లాస్ గార్డెన్​ గా దగ్గరగా నివసిస్తుంది.  ఈ గార్డెన్​ రాత్రి సమయంలో అతిథి గృహంగా ఉపయోగపడుతుంది.  ఇక్కడ చిన్నపాటి ఫంక్షన్లు కూడా జరుగుతాయి. మరియు పెద్ద పెద్ద కంపెనీలు సమావేశాలు పెట్టుకునేందుకు వీలుగా ఉంటుంది.  ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  స్థానికులను ఈ ప్రాంతం ఆకర్షిస్తుంది.బెల్లాస్​ గార్డెన్​ లో చాలా సౌకర్యాలుంటాయి.  విదేశీయుల కూడా ఇక్కడ బస చేస్తుంటారు. శిబు ఘోష్​ చెరువులతో అన్నం తిన్న తీరు చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.  వేడి నుంచి ఇలా కూడా రిలక్స్​ అవ్వచ్చని ఇప్పుడే తెలిసిందని కొందరు కామెంట్​ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో  పర్యాటకులు ఎంతో ఎంజాయి చేయవచ్చు.  వివిధ రకాల ఆహార పదార్దాలు ఇక్కడ లభిస్తాయి.