బెంగాల్.. మరో గుజరాత్ కావాలా?

బెంగాల్.. మరో గుజరాత్ కావాలా?
  • సెంట్రల్ దళాలు ఢిల్లీ చెప్పినట్టు చేస్తున్నయ్..
  • హుగ్లీ జిల్లా ఎలక్షన్​ మీటింగ్‌‌‌‌లో​ మమతా బెనర్జీ

బాలాగఢ్: సెంట్రల్ పారామిలిటరీ దళాలపై వెస్ట్​ బెంగాల్​సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. వారు గ్రామాలను సందర్శించి ప్రజలను బెదిరించే అవకాశం ఉందని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గురువారం హుగ్లీ జిల్లాలో ఆమె ఎలక్షన్​మీటింగ్​లో మట్లాడారు. బెంగాల్.. మరో గుజరాత్​ కావాలని కోరుకుంటున్నారా? అని ఓటర్లను మమత ప్రశ్నించారు. బీజేపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. మన పండుగ దుర్గ పూజను రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించాలన్నారు. సెంట్రల్​దళాలకు భయపడొద్దన్నారు. మిమ్మల్ని సెంట్రల్​దళాలు వేధిస్తే లోకల్​పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్​ఇవ్వాలని, ఒకవేళ వారు కేసు నమోదు చేసుకోకపోతే తమకు ఇన్​ఫాం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేను సెంట్రల్​పారామిలిటరీ దళాలను గౌరవిస్తాను. కానీ వీరు సెంట్రల్​ హోం మినిస్టర్​అమిత్​షా ఆదేశానుసారం పనిచేస్తున్నారు. పోలింగ్​ముందు రోజు వారు గ్రామాల్లో పర్యటించి ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు మహిళలను కూడా వేధిస్తున్నారు. బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నారు’అని మమత ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు సెంట్రల్​దళాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘మీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టొద్దు’ అని పోలీసులను కోరారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. పోలింగ్​బూత్​కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్​ ఉంటుందని, అయితే నియోజకవర్గం మొత్తం144 సెక్షన్​ ఉన్నట్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ ఒటర్లు పోలింగ్​సెంటర్లకు వెళ్లకుండా వారు ఇలా చేస్తున్నారని చెప్పారు.