రెండు గంట‌ల్లో బెంగ‌ళూరు - చెన్నై.. విమానం కంటే స్పీడ్ ట్రైన్ వ‌స్తుంది

రెండు గంట‌ల్లో బెంగ‌ళూరు - చెన్నై.. విమానం కంటే స్పీడ్ ట్రైన్ వ‌స్తుంది

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బెంగళూరు నుంచి చెన్నైకి రైలులో వెళ్లాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రధాన నగరాలకు వెళ్లాలంటే ప్రస్తుతమున్న ప్రయాణ సమయాన్ని 2గంటలు తగ్గించనున్నట్టు తెలిపింది. ఈ మార్గంలో త్వరలోనే సెమీ హై స్పీడ్ ట్రైన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.  

మరికొద్ది నెలల్లో ఈ కొత్త రైలు సర్వీసును ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లతో కలిపి 16 కోచ్ లతో పూర్తిగా రిజర్వ్ చేయబడిన రైలును అందుబాటులోకి తీసుకురానుంది. దీని వల్ల కేవలం 2గంటల 15నిమిషాల ప్రయాణ సమయంలోనే గమ్య స్థానాన్ని చేరవచ్చు. ఈ కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టడం వల్ల రెండు నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం కూడా సులభమవుతుంది.

బైయప్పనహల్లి మధ్య సాగే ఈ సర్వే కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూ.8.3కోట్లు కేటాయించనుంది. ఈ హై స్పీడ్ రైలు సర్వీస్ గంటకు 320కి.మీ. వేగంతో వెళ్లనుంది.