నెలకు 6 లక్షలు కూడా సరిపోవటం లేదంట..? : బతకటానికి ఏం చేస్తారంటూ నెటిజన్స్ డౌట్స్

నెలకు 6 లక్షలు కూడా సరిపోవటం లేదంట..? : బతకటానికి ఏం చేస్తారంటూ నెటిజన్స్ డౌట్స్

సాధారణంగా బెంగళూరులో లైఫ్ అంత ఈజీ కాదు. లక్షల్లో సంపాదించామని హ్యాపినెస్ అక్కడి ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉండటంతో ఆవిరౌతుంటుంది. ఈ క్రమంలోనే బెంగళూరులో జీవితం ప్రపంచంలోని ప్రఖ్యాత నగరాల కంటే కూడా ఎక్కువగా ఉందా అనిపిస్తున్న ఈ కపుల్ చెబుతున్న లెక్కలు వింటే.. 

వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన ట్రావెల్ కపుల్ ఆగస్టు నెలలో తమ ఖర్చులకు సంబంధించిన వివరాలతో ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తాము ఆగస్టులో రూ.5లక్షల 90వేలు ఖర్చు చేసినట్లు వాళ్లు చెప్పిన లెక్కలు విన్న నెటిజన్లు అసలు మీరు సంపాదన కోసం ఏం చేస్తుంటారంటూ కామెంట్ చేస్తున్నారు. తాము నెల ప్రారంభంలో బడ్జెటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటామని ఇందులో ఖర్చుల నుంచి పెట్టుబడుల వరకు అన్నింటికీ ప్రాధాన్యం ఇస్తామని వారు వీడియోలో చెప్పారు. 

ALSO READ : మీ బ్రౌసింగ్ హిస్టరీ పూర్తిగా డిలేట్ చేయడం ఎలా అంటే ?

ఒక్కసారి ఈ కపుల్ తమ నెలవారీ బడ్జెట్ షీట్ గురించి వివరిస్తూ ఆగస్టులో దేనికోసం ఎంత ఖర్చు చేశారు అనే వివరాలు వెల్లడించారు. ఇందులో ఇంటి అద్దెకు రూ.42వేలు, జిమ్ అండ్ ఫిట్ నెస్ కోసం రూ.40వేలు, కిరాణా సామాన్లకు రూ.20వేలు, యుటిలిటీ ఖర్చులకు రూ.10వేలు, బయట డైనింగ్ కోసం రూ.13వేలు.. ఇక చివరిగా తమ విమాన ప్రయాణాలు, హోటల్ బుక్కింగ్స్ కోసం రూ.3లక్షల 50వేలు వెచ్చించినట్లు చెప్పారు. దీనికి తోడు ఇతర ఖర్చుల కోసం రూ.15వేలు అలాగే పెట్టుబడుల కోసం రూ.లక్ష ఖర్చయిందని వెల్లడించారు. 

బెంగళూరు ట్రావెల్ కపుల్ చెప్పిన లెక్కలు విని నెట్టింట మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు యూజర్లు అసలు మీరు సంపాదన కోసం ఏం చేస్తుంటారని ప్రశ్నిస్తుండగా.. మరొకరు ఈ కపుల్ నెల ఖర్చు ఒక ఏడాది ఆదాయానికి సమానంగా ఉందని కామెంట్ పెట్టారు. మరొకరైతే బెంగళూరు లండన్ నగరం కంటే ఖరీదైనదిగా కనిపిస్తోందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.