30 ఏళ్ల ప్రాణ స్నేహితుడిని కొట్టి చంపేశాడు : చెప్పినా వినని ఆ భార్య వల్లే..!

 30 ఏళ్ల ప్రాణ స్నేహితుడిని కొట్టి చంపేశాడు : చెప్పినా వినని ఆ భార్య వల్లే..!

ఏ బంధం అయినా ఒక చిన్న తప్పుతో ఎన్నో అనుమానాలకు, హత్యలకు దారి తీస్తుంది. 30 ఏళ్లుగా కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు వివాహేతర సంబంధం వల్ల ఒకరిని చంపే వరకు వెళ్ళింది. టెక్ సిటీ ఆయిన  బెంగళూరులో ఓ 39 ఏళ్ల వ్యక్తి హత్య గురైయ్యాడు. ఇందుకు కారణం అతని చిన్ననాటి స్నేహితుడు అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 

విజయ్ కుమార్ అలాగే  ధనంజయ అలియాస్ జే గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులు, బెంగళూరులోని మాగడిలో ఇద్దరు కలిసి పెరిగారు, తరువాత సుంకడకట్టే ప్రాంతానికి మారారు. రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ నిర్వహిస్తున్న విజయ్ దాదాపు పదేళ్ల క్రితం ఆశా అనే మహిళను పెళ్లి చేసుకొని కామాక్షిపాల్యలో ఉంటున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం విజయ్ కొద్దిరోజుల క్రితం తన భార్య ధనంజయతో ప్రేమలో ఉందని, వారిని రెడ్ హ్యాండ్ గా కూడా   పట్టుకున్నాడని, ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బయటపడ్డాయని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై భార్యాభర్తల మధ్య  గొడవ జరిగింది, ఎలాగైనా తన కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో విజయ్ తన భార్యతో కలిసి కడబగెరె సమీపంలోని మాచోహళ్లిలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడికి మారాడు. కానీ అక్కడ కూడా  అక్రమ సంబంధం కొనసాగిందని ఆరోపణలు ఉన్నాయి.

విజయ్ హత్యా జరిగిన రోజు ఉదయం నుండి ఇంట్లోనే ఉన్న అతను సాయంత్రం బయటకు వెళ్ళాడు. తరువాత ఎం జరిగిందో తెలియదు కానీ అతను మాచోహల్లిలోని డిగ్రూప్ లేఅవుట్ ప్రాంతంలో చనిపోయి కనిపించాడు. ఆశా  ధనంజయ మధ్య జరిగిన కుట్ర వల్లే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాదనాయకనహళ్లి పోలీసులు ఆశను విచారణ కోసం  అదుపులోకి తీసుకోగా, పారిపోయిన ధనంజయ కోసం పోలీసులు గాలిస్తున్నారు.