ఫ్రీ అంటే ఇలాగే ఉంటది : మందు ధరలు భయంకరంగా పెంచిన కర్ణాటక

ఫ్రీ అంటే ఇలాగే ఉంటది : మందు ధరలు భయంకరంగా పెంచిన కర్ణాటక

కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో బీర్‌తో సహా ఆల్కహాల్ మరింత ఖరీదైనదిగా మారనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జూలై 7న 2023-24 బడ్జెట్‌లో భాగంగా అదనపు ఎక్సైజ్ సుంకాన్ని  (ఏఈడీ) పెంచాలని శాసనసభలో ప్రతిపాదించారు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)పై ప్రస్తుతం ఉన్న డ్యూటీ రేట్లను మొత్తం 18 శ్లాబ్‌లపై 20 శాతం పన్ను అధనంగా విధించాల్సి వస్తుందని.. ఆయన తన బడ్జెట్ లో ప్రతిపాదించారు. అదే విధంగా బీరుపై కూడా 10 శాతం సుంకాన్ని అదనంగా విధించనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో లిక్కర్ ధరలు అమాంతం పెరగనున్నాయి. బీరు ధరలు 10 శాతం, మిగతా లిక్కర్ ధరలు 20 శాతం పెరగనున్నాయి. 

ALSO READ :4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించిన బీజేపీ అధిష్టానం

ఎక్సైజ్ రేట్లను పెంచాలని ప్రతిపాదించినప్పటికీ కర్ణాటకలో మద్యం ధర పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగానే ఉంటుందని సీఎం సిద్ధరామయ్య తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కర్నాటక బడ్జెట్ 2023-24 ఎక్సైజ్ శాఖకు ఆదాయ సేకరణ లక్ష్యాన్ని రూ. 36వేల కోట్లుగా నిర్ణయించింది. పెంపుదల, సమర్థవంతమైన అమలు, నియంత్రణ చర్యల ద్వారా ఇది సాధించడం సాధ్యమవుతుందని సిఎం సిద్ధరామయ్య తెలిపారు.