IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ కి సమయం దగ్గరపడుతుండటంతో క్రికెట్ ప్రపంచంలో టెన్షన్ పీక్స్‌కు చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య కాసేపట్లో టైటిల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో తమ అభిమాన జట్టు ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఇప్పుడు దేవుడ్ని వేడుకుంటున్నారు. జట్టు గెలుపు కోసం ఏకంగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
విజయ్‌నగర్‌లో ఆర్సీబీ జెర్సీలతో ప్రత్యేక హోమం:
బెంగళూరులోని విజయ్‌నగర్ ప్రాంతంలో ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా ఒకచోట చేరి పెద్ద హోమం నిర్వహించారు. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని బెంగళూరు జట్టు ఫైనల్లో గెలవాలని, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాలని భగవంతుడిని ప్రార్థించారు.
* రెడ్ అండ్ గోల్డ్ హంగామా: ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులంతా ఆర్సీబీ జెర్సీలు ధరించి, చేతుల్లో ఫ్రాంచైజీ జెండాలు పట్టుకుని మంత్రాలు పఠిస్తూ కనిపించారు.
* నెట్టింట వైరల్: ఈ హోమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఆర్సీబీ జట్టుతో బెంగళూరు ప్రజలకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలాంటిదో ఈ పూజలు మరోసారి నిరూపించాయి.
►ALSO READ | ఐపీఎల్ ఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డులు.. బెంగళూరుకు ట్రోఫీ అందించేనా!
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఆర్సీబీ:
ఆర్సీబీ అభిమానులు అందరూ ఇంతలా పూజలు ఎందుకు చేస్తున్నారంటే.. ఆర్సీబీ జట్టు ఒక సరికొత్త రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. గత ఏడాది (2025) బెంగళూరు తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు గనుక గుజరాత్ టైటాన్స్‌ను ఓడిస్తే.. ఐపీఎల్ చరిత్రలోనే బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్‌గా నిలిచిన మూడో జట్టుగా బెంగళూరు సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ఆర్సీబీ గెలవాలని కర్ణాటకలో జోరుగా పూజలు:
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఐపీఎల్ 2026 ఫైనల్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అభిమానులు పూజలు, మొక్కులు పూర్తి చేసి ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. మరి ఈ దైవ బలం, ఫ్యాన్స్ నమ్మకం తోడై రజత్ పాటిదార్ సేన అహ్మదాబాద్ నుంచి కప్పును మళ్లీ బెంగళూరుకు పట్టుకొస్తుందో లేదో అనేది వేచి చూడాలి.
#WATCH | Karnataka: Cricket fans in Bengaluru organised a special pooja and hawan, praying for Royal Challengers Bengaluru’s victory in the final of the Indian Premier League, which will be played today between the Royal Challengers Bengaluru and Gujarat Titans at Narendra Modi… pic.twitter.com/O7SneENp4R
— ANI (@ANI) May 31, 2026
