బెంగళూరులో ప్రారంభమైన 4నెలలకే కుంగిన రోడ్డు

బెంగళూరులో ప్రారంభమైన 4నెలలకే కుంగిన రోడ్డు

బెంగళూరులో ₹ 19.5 కోట్ల అండర్‌పాస్‌లో భాగంగా నిర్మించిన సర్వీస్ రోడ్డు కుంగిపోయింది. ఇక్కడ చెప్పదగిన ముఖ్య విషయమేమిటంటే ఇది ప్రారంభించి కేవలం 4 నెలలే కావడం. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ కు ఈ ఘటనతో మరిన్ని ఆధారాలొచ్చినట్టైంది. తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపే కుందనహళ్లి అండర్‌పాస్ వద్ద దీనికి సంబంధించిన మరమ్మతులు జరుగుతున్నాయి.  ఈ విషయంపై అధికారులు ఇంకనూ స్పందించలేదు. కానీ ఈ రహదారి మరమ్మతుల్లో సిగ్నల్ ఫ్రీ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాత్రం కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ రోడు కొంచెం కుంగిపోయిందని, దీనికి కారణం దాని కింద ఉన్న పైపు విరిగిపోయి నీరు లోపలికి ప్రవేశించడం వల్లనేనని తెలిపారు. దీంతో దీని కింద ఉన్న మట్టి సైతం వదులుగా తయారైందని చెప్పారు. కానీ ఈ ఈ రహదారి మరమ్మతు పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ఈ పైప్‌లైన్‌ను ఈ రహదారి మరమ్మతులు పనులు చేపట్టింది. అయితే ఈ రోడ్డును సరిచేయడానికి మరికొన్ని రోజులు పట్టనున్నట్టు సమాచారం. అండర్‌పాస్ వార్షిక నిర్వహణ, లోపభూయిష్ట బాధ్యత నిబంధన కింద కవర్ చేయబడినందున కాంట్రాక్టర్ దీన్ని ఉచితంగా చేయవలసి ఉంటుందని పౌర సంఘం అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు నాగరాజ్ యాదవ్ స్పందించారు. "40 శాతం" అవినీతికి మరొక ఉదాహరణ అని కామెంట్ చేశారు. శాసనమండలి సభ్యుడు యాదవ్‌ సైతం కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్‌ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.