ఎంత అన్యాయం : కోటిన్నర పెట్టి ఫ్లాట్ కొంటే.. వర్షానికి లీకులు

ఎంత అన్యాయం : కోటిన్నర పెట్టి  ఫ్లాట్ కొంటే.. వర్షానికి లీకులు

సొంతిళ్లు అంటే అందరికీ జీవితంలో ఒక కల. ఇక బెంగళూరులో సొంతిళ్లు, ఫ్లాట్ అంటే చెప్పాల్సిన పనిలేదు.  ఐటీకి అడ్డా అయిన బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్ లో ఉంది. దీంతో ఇక్కడ ఒక్కో ఫ్లాట్ కోటికి పైగా పలుకుతోంది. అయితే కోట్లు పెట్టి కొనుగోలు చేసినా ఆ ఫ్లాట్ నిర్మాణంలో క్వాలిటీ ఉంటుందా? అంటే డౌటే. ఎందుకంటే.. ఈ మధ్య ఇంజినీర్లు, బిల్డర్లు కుమ్మక్కై నాసిరకం ఇండ్లను కడుతున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వర్షాలకు స్లాబ్ లీక్ కావడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. 

 లేటెస్ట్ గా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కోటిన్నర పెట్టి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్  కొనుగోలు చేసిన ఓ టెక్కీ ప్లాట్ లో స్లాబ్ నుంచి వాటర్ లీక్ అవుతోంది. ఈ ఘటనను అతను ఫోటో తీసి తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇది లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. 

Also Read:-స్థిరంగా బంగారం.. మళ్ళీ పెరిగిన వెండి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

 రిపుదామన్ అనే ఓ ఇంజినీర్..ఓ అపార్ట్ మెంట్ లో  కోటిన్నర పెట్టి ఐదో అంతస్తులో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు.  ఇంట్లో  స్లాబ్ నుంచి నెమ్మదిగా  వాటర్ లీక్ అవుతోంది. ఫ్లాట్ గోడలు తేమగా కనిపిస్తున్నాయి.   ఈ కాస్ట్ లీ బిల్డింగ్ లు ఎంత మోసం బ్రో..అని లీక్ అవుతున్న ఫోటోను షేర్ చేశాడు.  కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటే.. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
టెక్కీ షేర్ చేసిన ఫోటోకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు.  క్వాలిటీ లేకుండా బల్డింగ్ లు కట్టి మోసం చేస్తున్నారని కొందరు..ఆ ఫ్లాట్ 50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఖర్చుతో నిర్మించి ఉండొచ్చు..మీకు ఎక్కువ రేటుకు అమ్మి ఉంటారని ఒకరు కామెంట్ చేస్తున్నారు.