హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు రెండో రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధరలో ఏ మార్పు లేదు. 10 గ్రాములకు గాను రూ. 64వేల 700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను రూ. 70 వేల 580గా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే, 22 క్యారెట్ల బంగారం 10గ్రాములకు గాను రూ. 64 వేల 850గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు గాను రూ.70 వేల 730 ఉన్నట్లు సమాచారం.
బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ వెండి మాత్రం మళ్ళీ పెరిగింది.మంగళవారం ( ఆగస్టు 6, 2024 ) హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 200 పెరిగిందని సమాచారం. దీంతో వెండి కిలో రూ. 91 వేల 100 కు చేరిందని తెలుస్తోంది. ఇక ఢిల్లీ మార్కెట్ విషయానికి వస్తే కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ. 85 వేల 700 వద్దకు చేరిందని తెలుస్తోంది.