Delhi Excise policy : బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత

Delhi Excise policy : బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత

 ఢిల్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ ను ఆగస్ట్ 6న  వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు సూచన మేరకు కవిత పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.

 ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సీబీఐ దాఖలు  కేసులో  తనకు బెయిల్ ఇవ్వాలని కవిత  రౌస్ అవెన్యూ కోర్టు  ఢీఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఆగస్ట్ 5న  ట్రయల్ కోర్టు విచారించింది. అయితే వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ సందర్భంగా జడ్జి కావేరి బవేజా కీలక వ్యాఖ్యలు చేశారు.. వాదనలు వినిపించకపోతే పిటిషన్ వెనక్కి తీసుకోండి..డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై లాస్ట్ చాన్స్ ఇస్తున్నామని తెలిపారు. అనంతరం పిటిషన్   విచారణను ఆగస్ట్ 7 కు వాయిదా వేశారు.   అయితే ఇవాళ కోర్టులో కవిత డీఫాల్ట్ పిటిషన్ ను వెనక్కి తీసుకోవం గమనార్హం.. 

లిక్కర్ స్కాం కేసులో  మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ప్రస్తుతంకవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఇవాళ కేటీఆర్,హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి ములాఖత్ కానున్నారు.