తొందరగా నిద్ర పట్టాలంటే ఇలా చేయాలి

తొందరగా నిద్ర పట్టాలంటే ఇలా చేయాలి

కొంతమందికి కొత్తచోటికి వెళ్తే నిద్ర పట్టదు. ఇంకొందరు రెగ్యులర్‌‌ టైం దాటితే పడుకోలేరు. దానివల్ల ఉదయం లేట్‌గా లేచి, టైంకి ఆఫీస్‌కి వెళ్లలేకపోతుంటారు. అలాంటివాళ్లకు తొందరగా నిద్రపట్టాలంటే..రోజూ నిద్రపోయో ముందు సంత్రాలు తినాలి. ఇందులో మెలటోనిన్‌  ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రపట్టడానికి సాయపడుతుంది.

అరటిపండులోని ట్రిప్టోఫాన్‌, మెగ్నీషియం కూడా నిద్ర పట్టేలా చేస్తాయి.నిద్రపోయేటప్పుడు మొబైల్‌ వాడే అలవాటు మానుకోవడం మంచిది. చాలామందికి ఒత్తిడి వల్ల కూడా నిద్ర పట్టదు. అలాంటివాళ్లు నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.