హైదరాబాద్‌‌లో ఘనంగా ఉత్తమ విలన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌

హైదరాబాద్‌‌లో ఘనంగా ఉత్తమ విలన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌

విజయ్, శ్రావ్య  జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీ నారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్‌‌‌‌లు కలిసి  నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’. రిలీజ్‌‌కి సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను హైదరాబాద్‌‌లో నిర్వహించారు. గెస్ట్‌‌గా హాజరైన రామ్‌‌ గోపాల్‌‌వర్మ  ట్రైలర్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ మధు’ తర్వాత నేను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియెన్స్ బిగ్ హిట్ ఇస్తారనే నమ్మకం ఉంది’ అన్నాడు. తమకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోహీరోయిన్స్.  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకొస్తోందన్నారు నిర్మాతలు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.