ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు: డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యసేవలు: డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణలో  ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న సదుపాయాలు మరెక్కడ లేవని, కరోనా సమయంలో పేషెంట్లకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటూ సేవలందించారని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. 

 శుక్రవారం తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్-1 రాష్ట్ర కార్యాలయాన్ని హెల్త్  డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శోభన్ రెడ్డితో కలసి డిప్యూటీ మేయర్ ప్రారంభించారు.  ప్రభుత్వం ఆశా వర్కర్లకు  వైద్య సిబ్బందికి అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో  నాయకులు  సాయి రెడ్డి, శివకుమార్,  రాంబాబు, రూప్ సింగ్,  నారాయణ,  వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.