కుండీల దొంగలున్నరు జాగ్రత్త!

V6 Velugu Posted on Oct 17, 2019

అది ఢిల్లీలోని ఓ మెయిన్‌‌ రోడ్డు. పక్కన పిల్లర్లున్నయి. వాటికి వర్టికల్‌‌ గార్డెన్‌‌ డిజైన్‌‌ చేసుంది. అంటే చిన్న చిన్న మొక్కల కుండీలు ఒకదానిపై ఒకటి పెట్టారన్నమాట. ఇంతలో ఓ అంకులొచ్చారు. మంచిగ ప్యాంటు, షర్టు వేసుకొని, టక్‌‌ చేసుకొని ఉన్నడు. ఆ మొక్కల దగ్గరకు పోయిండు. నీళ్లు పోస్తడేమో అనుకునేరు. మట్టిని పారేసి ఆ ప్లాస్టిక్‌‌ కుండిని వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకున్నడు. ఇదంతా వెనుక నుంచి ఎవరో వీడియో తీస్తుంటే చూసిండు. ఇంకేముంది.. ఉరుకుడే ఉరుకుడు. అర నిమిషంలో మాయమైండు. మళ్ల కనిపిస్తే ఒట్టు. ఈ వీడియో ఇంటర్నెట్‌‌లో వైరలైంది. ‘ఆ కుండీలను ఏం చేసుకుంటడబ్బా?’ అని ఒకరు కామెంట్‌‌ చేస్తే.. ‘కచ్చితంగా మొక్కలైతే నాటడు’ అని మరొకరు.. ‘ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే’ అని ఇంకొకరు అన్నారు.

Tagged Delhi, Beware, robbers, vase

Latest Videos

Subscribe Now

More News