కరకట్టపై డంపింగ్​యార్డును తరలించాలి

కరకట్టపై డంపింగ్​యార్డును తరలించాలి

భద్రాచలం, వెలుగు:  రామాలయం పరిసర ప్రాంతంలోని గోదావరి కరకట్టపై ఉన్న చెత్త డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ముదిరాజ్​ బజార్​, చప్టా దిగువ, రామాలయ పరిసర ప్రాంతాల ప్రజలు ఆదివారం కరకట్టపై ధర్నా నిర్వహించారు. పంచాయతీ వాహనాలను కట్టపై అడ్డుకున్నారు. 

 గ్రామ పంచాయతీ అధికారుల తీరు వల్ల రామాలయం పరిసర కాలనీల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని సీపీఎం టౌన్​ సెక్రటరీ గడ్డం స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తను కాల్చడం ద్వారా వచ్చే పొగ రామాలయానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందిగా మారిందన్నారు.  సుందరయ్యకాలనీలో చెత్త డంపింగ్​యార్డును నిర్మించి, కరకట్టపై ఎందుకు పోస్తున్నారని నిలదీశారు.