
భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. రూ.1 కోటి 76 లక్షల347 నగదుతో పాటు బంగారం115 గ్రాములు, వెండి1,390 గ్రాములు, పలు దేశాల కరెన్సీని కూడా భక్తులు సమర్పించినట్టు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలతో ఆలయ ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీలు తెరిచారు. గత మార్చి20న చివరిసారిగా హుండీలను లెక్కించారు.