- కెనడా ఎన్జీవో ఆర్గనైజర్ జోసెఫ్ జాక్సన్ ప్రశంస
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం భేష్ అని కెనడా ఆల్బెర్ట్ కాలేజీ ఎన్జీవో ఆర్గనైజర్ జోసెఫ్జాక్సన్ ప్రశంసించారు. సోమవారం ఆయన చత్తీస్గఢ్ స్టేట్ ఎన్జీవోస్ టీమ్ తో కలిసి ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించారు. గిరిజన గూడేల నుంచి సేకరించి మ్యూజియంలో భద్రపరిచిన వస్తువులను చూశారు. గిరిజన గూడేల్లో పర్యటించానని, వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు చాలా బాగున్నాయని అభినందించారు. వారి జీవన విధానంపైన స్టడీ చేస్తున్నట్టు జాక్సన్ తెలిపారు.
