లాక్‍డౌన్‍ తర్వాత రామయ్య హుండీ లెక్కింపు

లాక్‍డౌన్‍ తర్వాత రామయ్య హుండీ లెక్కింపు

ఆదాయం రూ.27.52 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థాన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. చివరిసారిగా మార్చి 4న హుండీని లెక్కించారు. మార్చి 20 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు కరోనా లాక్‍డౌన్‍ కారణంగా ఆలయాన్ని మూసివేశారు. భక్తులను దర్శనానికి అనుమతించలేదు. లెక్కింపులో స్వామివారికి రూ.27,52,536 ఆదాయం వచ్చింది. బంగారం, వెండి రాలేదు. కెనడా 5 డాలర్లు, కువైట్‍ 1 దీనార్‍, అరబ్‍ 5 దీరమ్స్, ఆస్ట్రేలియా 5 డాలర్లు, నేపాల్ ‍10 రూపాయలు వచ్చాయి. కేవలం 16 రోజుల హుండీ ఆదాయమే లెక్కించినట్లుగా ఈవో గదరాజు నర్సింహులు పేర్కొన్నారు.

For More News..

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ