భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం పలు శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా వేకువజామున 5 గంటలకే కూలీలు పని ప్రదేశాలకు చేరుకునేలా చూడాలన్నారు.
ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అంగన్వాడీ బిల్డింగ్లు, టాయ్లెట్స్, మహిళా సంఘాల భవనాల పనులు స్పీడప్చేయాలన్నారు. దివ్యాంగుల సదరం కేంద్రాల్లో సౌండ్ ప్రూఫ్ పరికరాలు, ఆధునిక వైద్య పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, పీఆర్ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
